FbTelugu

మోదీకి లేఖ రాసిన మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా రోజుల తరువాత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. అది కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో రాయడం విశేషం.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం, వ్యాక్సిన్ కొరత, వైరస్ తీవ్రతపై మన్మోహన్ పలు సూచనలు చేశారు. దేశంలో కరోనా విలయం, ప్రభుత్వ నిర్లిప్తతపై శనివారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం అయిన వరుసటి రోజే మన్మోహన్ సింగ్ లేఖ రాశారు. 12 కోట్ల మందికి మూడు నెలల వ్యవధిలో వ్యాక్సిన్ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదని దేశ జనాభాలో ఎంత శాతం మందికి వేశామనేది బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఆరు నెలల కోసం ఇప్పడే వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇవ్వాలని, రాష్ట్రాల వారిగా ఇప్పుడే కోటా జాబితాను పంపించాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సమకూర్చేందుకు కేంద్రం వద్ద పదిశాతం వ్యాక్సిన్లు మాత్రమే ఉండాలని మన్మోహన్ సింగ్ సూచించారు.

వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న రెండు కంపెనీలకు రాయితీలు, నిధులు సత్వరమే మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. దేశంలో పరిస్థితులు ఏమంత బాగా లేవని, ఆరు నెలల్లో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ పూర్తి చేయాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.