FbTelugu

తారుమారైన వ్యాక్సిన్… 27 మందిలో టెన్షన్

చిత్తూరు: దేశంలో ఒకరిద్దరికి వ్యాక్సిన్ తారుమారైన విషయం విన్నాం కాని ఏకంగా 27 మందికి తారుమారు కావడం గమనార్హం. రెండో డోసు వ్యాక్సిన్ మారడంతో వేయించుకున్న వారిలో టెన్షన్ మొదలైంది.

పెనమూరు మండలం గుడ్యానంపల్లి వ్యాక్సిన్ కేంద్రంలో ఏఎన్ఎం నిర్లక్ష్యం కారణంగా బాధితులు ఆందోళన చెందుతున్నారు. తొలిడోసు కోవిషీల్డ్ తీసుకున్నవారు మలి డోసు కోసం మళ్లీ వచ్చారు. వారిలో 27 మంది కోవిషీల్డ్ బదులు కోవాగ్జిన్ వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు లబోదిబొమంటున్నారు. తమకు కోవిషీల్డ్ బదులు కోవాగ్జిన్ డోసు వేశారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే, ఏమి కాదులే అని వైద్య సిబ్బంది సర్ధి చెప్పి పంపించారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచికి తెలియచేయగా ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.