FbTelugu

ప్రతిపక్షాలకు కాలం చెల్లింది: ఆళ్ల రామకృష్ణా రెడ్డి

గుంటూరు: రాష్ట్రంలో ఇక ప్రతిపక్షాల కాలం చెల్లిందని మంగళగిరి వైసిపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
అసెంబ్లీలో మూడు రాజధానులు పై చేసిన నిర్ణయం ను ఎన్నికల్లో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమోదం తెలిపారు.

రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుంటూరు, విజయవాడ సభలో ఎంత గా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఫలితం లేకపోయిందని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటు కేవలం బినామీల కోసం అనే విషయం ఈ ప్రాంత ప్రజలే కాకుండా 13 జిల్లాలో ఓటర్లుకు అర్థమయిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.