FbTelugu

నడుముకు గన్ తో వ్యక్తి హల్ చల్

హైదరాబాద్: ఓ యువకుడు నడుముకు గన్ పెట్టుకుని స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసిన ఘటన నగరంలోని శంషాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఫుల్ గా మద్యం సేవించిన ఓ వ్యక్తి నడుముకు గన్ పెట్టుకొని తాను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ లో పని చేస్తానంటూ స్థానికుల మధ్యకు వచ్చాడు.

దీంతో అతని వాలకం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతని వద్ద ఉన్న గన్ నిజమైంది కాదని ఎయిర్ గన్ గా గుర్తించారు. అతడు బేగంపేటకు చెందిన సోహెల్ గా గుర్తించారు. అతడు బంధువుల ఇంట్లో ఉంటూ ఎయిర్ పోర్ట్ కార్గోలో ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.