FbTelugu

లైవ్ లోనే దూకి చనిపోయిన వ్యక్తి

విజయవాడ: కనకదుర్గ వారధి పై దారుణం చోటుచేసుకున్నది. తాడిగడప కి చెందిన మన్నే దుర్గాప్రసాద్ వరద నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూజ చేసుకుంటాను అంటూ వారధి పై కి వచ్చిన దుర్గాప్రసాద్.. తమ్ముడు కుమారుడు సుజిత్ ని ఫోన్ లో వీడియో తీయమని చెప్పి లైవ్ లోనే నదిలోకి దూకేశాడు.

అనారోగ్యంతో చనిపోతున్నానని సూసైడ్ నోట్, ఫోన్ ను దుకటానికి ముందే తమ్ముడు కొడుకు కి ఇచ్చాడు. కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవడంతో సుజిత్ షాక్ కి గురయ్యాడు. వెంటనే తేరుకుని తాడేపల్లి పోలీసులు కి ఫిర్యాదు చేశాడు. గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.