FbTelugu

పార్సిల్ వచ్చిందంటూ.. రూ.70 వేలు స్వాహా..

man-loss-rs-70-thousand-by-syber-crime-

మంగళగిరి: మీకో పార్సిల్ వచ్చింది.. ఆ పార్సిల్ మీకు రావాలంటే రూ.11 చెల్లించాలంటూ గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి ఏకంగా రూ.70 వేలు దోచుకున్న ఘటన మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన అర్జునరావు అనే వ్యక్తికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాము కొరియర్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, మీకు ఒక పార్సిల్‌ వచ్చిందని చెప్పారు. మీ చరవాణికి ఒక సంక్షిప్త సందేశం పంపిస్తాం. దాని ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.11 పంపిస్తే మీకు పార్శిల్‌ ఇస్తామని చెప్పారు. చిన్నమొత్తమే కదా అని ఆ సంక్షిప్త సందేశం లింక్‌ తెరిచి రూ.11 పంపారు. తరువాత ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.70 వేలు వేరే ఖాతాకు బదిలీ అయినట్లు చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేస్తే పని చేయక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు

You might also like