FbTelugu

యుఎస్ లో దుండగుడి కాల్పులు

వాషింగ్టన్: ఒక అగంతకుడి కాల్పుల్లో ఒక మహిళతో పాటు ఏడాది బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ఫ్లోరిడాలోని రాయల్ ఫామ్ బీచ్ లోని పబ్లిక్స్ గ్రాసరీ స్టోర్ లో చోటు చేసుకున్నది.

ఆదివారం నాడు ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే మళ్లీ గురువారం నాడు కాల్పులు జరిగాయ. పబ్లిక్స్ గ్రాసరీ స్టోర్ లోకి ప్రవేశించి అగంతకుడు కాల్పులకు తెలబడ్డాడు. ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయస్సు ఉన్న ఆమె మనవడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత అగంతకుడు తనను తాను కాల్చుకుని బలవన్మరణం చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఏ కారణం చేత కాల్పులకు తెగబడ్డాడు అనేది పోలీసులు విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.