FbTelugu

సొంత అన్ననే కడతేర్చాడు

ఖమ్మం : ఓ యువకుడు భూతగాదాలతో సొంత అన్ననే కడతేర్చాడు. ఈ ఘటన జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి విషయంలో అన్నాదమ్ములైన బానోతు హరి, బానోతు సంతు మధ్య వివాదం తలెత్తింది.

కాగా తమ్ముడు సంతు అన్నను అతి దారుణంగా హత్య చేశారు. దీంతో బంధువులు సంతు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంతును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.

You might also like