FbTelugu

వేటగాళ్ల ఉచ్చులో వ్యక్తి మృతి.. నలుగురు రిమాండ్

Man-killed-in-hunters-trap-4-members-in-remand

భద్రాద్రి కొత్తగూడెం: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో నలుగురిని రిమాండ్ కి పంపారు. వివరాల్లోకెళితే.. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలోని బూర్గుడెంలో… గత నెల 29న వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలు తగలడంతో గ్రామానికి చెందిన పటాన్ హజ్మత్ ఖాన్ మృతి చెందాడు. ఈ కేసులో అటవీ జంతువుల కోసం విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసిన సంఘటనలో గురువారం పోలీసులు నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. జూలూరుపాడు సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని మాయం చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులైన పైదా రాము, కాకా అశోక్‌, మొడియం తిరుపతిరావు, మొడియం బొడప్పలను రిమాండ్‌ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ వివరించారు.

You might also like