విశాఖపట్నం: ఇవాళ విశాఖలోని ఫార్మాసిటీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. కాండ్రేగుల శ్రీనివాస్(40) అనే వ్యక్తి రాత్రి విధులను నిర్వహించేందుకు వెళ్లి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఆచూకీ లేకపోవడంతో స్థానికులు అతడు మృతి చెంది ఉంటాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరుణంలో ప్రమాద స్థలి వద్ద పూర్తిగా కాలి ఉన్న ఓ మృతదేహం వీడియో బయటకు రావడంతో అనుమానం మరింత ఎక్కువైంది. అయితే అది శ్రీనివాస్ మృతదేహమేనని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు.