FbTelugu

రూ.2 కోసం ఘర్షణ.. ఒకరు మృతి

man-killed-in-clash-for-Rs-2

తూ.గో. జిల్లా: రెండు రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాకినాడ రూరల్, వలసపాకలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవు సువర్ణరాజు(24) అనే యువకుడు ఓ సైకిల్ షాపు వద్ద తన సైకిల్ కి గాలి పెట్టుకున్నాడు. దాంతో సైకిల్ షాప్ యజమాని సాంబ 2 రూపాయలు ఇవ్వమనగా.. దానిపై వారిద్దరిమధ్య వాగ్వాదం పెరిగి సువరర్ణరాజు సాంబపై దాడి చేశాడు. దీంతో సాంబ స్నేహితుడు అప్పారావు సువర్ణరాజును కత్తితో పోడిచారు. కత్తిపోటుకు గురైన సువర్ణరాజులను కాకినాడలో ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like