FbTelugu

దేవస్థానం బస్సు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

విశాఖపట్నం: దేవస్థానం బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని సింహాచలం ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన సింహాచలం దేవస్థానం బస్సు, మరో బైకు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like