FbTelugu

కరోనా పాజిటివ్ అని వ్యక్తి ఆత్మహత్య!

విశాఖపట్నం: మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తాజాగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు.

వివరాల్లోకెళితే.. విశాఖలోని శాంతి నగర్‌కు చెందిన భూతల శ్రీను మహేష్(48)అనే వ్యక్తి ఈ నెల 11న ఉదయం నాలుగు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తాజా రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. మహేష్ సూసైడ్ చేసుకున్న రోజు వందల సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చి వెళ్లారు. తాజా పాజిటివ్ రిపోర్టుతో అందరూ భయాందోళనలో మునిగిపోయారు. మృతునికి ముందుగానే కరోనా ఉందని తెలియండో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.