FbTelugu

ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి హల్ చల్

హైదరాబాద్: ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వీరంగం సృష్టించిన ఘటన నగరంలోని పంజాగుట్ట సర్కిల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట సర్కిల్ లో ఉన్న ఫ్లైఓవర్ మిది నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫ్లైఓవర్ పక్కనుంచి వెళుతున్న ఆర్టీసీ బస్ పైకి ఎక్కి రెస్క్యూ చేసి కాపాడారు. అతడు ఎందుకలా ప్రవర్తించాడనే విషయం తెలియరాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.