FbTelugu

భోజనాలు పెట్టించాడని వ్యక్తి అరెస్ట్

పశ్చిమగోదావరి: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి అరెస్ట్ నమోదైంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని  జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటలో ఆకుల సుధాకర్ అనే వ్యక్తి యారణాల భోజనాలు ఏర్పాటు చేశాడు.

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండగా.. నిబంధనలను ఉల్లంఘించి భోజనాలు ఏర్పాటు చేసిన కారణంగా అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ముందుగానే ఈ కార్యక్రమం నిలిపివేయాలని చెప్పినా వినిపించుకోకుండా భోజనాలు నిర్వహించడంతో ఆకుల సుధాకర్ పై 188 ఐపిసి, 269 ఐపిసి, 270 ఐపిసి సెక్షన్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపినట్టు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More