FbTelugu

మమత కాలికి గాయం.. ఉద్రిక్తత!

కొలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు బుధవారం సాయంత్రం నామినేషన్ వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన జరిగిందని ఆమె ఆరోపించారు.
రేయపరా వద్ద నా కారు వద్ద నిల్చుని ఉండగా డోర్ తెరిచి ఉండడంతో ఎదురుగా కన్పిస్తున్న గుడి వైపు చూస్తు ప్రార్థించాను. కార్లోకి వెళ్దామని అనుకుంటుండగా నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి డోర్ ను నా వైపు బలంగా తన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. కాలు వాచిందని, ఛాతిలో నొప్పిగా ఉందన్నారు. ఈ ఘటనతో కొలకతా వెళ్తున్నానని, రాత్రి నందిగ్రామ్ లో బస చేయాలని అనుకున్నానని ఆమె తెలిపారు.

మమతకు కొలకతాలోని ప్రభుత్వ ఎస్.కె.ఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటన తెలిసి టీఎంసీ నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాలికి ఎక్స్ రే తీశామని, గాయాన్ని బట్టి శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు ప్రకటించారు. పరామర్శించేందుకు గవర్నర్ వెళ్లగా, గో బ్యాక్ అంటూ టీఎంసీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాడి ఘటనపై నివేదిక అందచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.