FbTelugu

మమతకు షాక్ తగిలింది

కోలకతా: మమతా బెనర్జీ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ సచీవుడు సివేందు అధికారి తన పదవికి రాజీనామా చేశారు. మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ కి పార్టీలో ప్రాముఖ్యతనివ్వడంతో సివేందు కొద్ది నెలలుగా అలకబూనారు.

ఇవాళ ఉదయం మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపించిన తరువాత ఆయన మరో కాపీనీ గవర్నర్ జగ్ దీప్ ధన్కర్ కు పంపించారు. నీటి పారుదల, రవాణ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తన లేఖలో తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారంటున్నారు.

నందిగ్రామ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సివెందు మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ సమావేశాలు, మంత్రివర్గ భేటీలకు కూడా గైర్హాజరు అవుతున్నారు. తన నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించినప్పటికీ, టీఎంసీ జెండాలు ఎక్కడా ఉపయోగించలేదు. ఈ నియోజకవర్గం నుంచి మమతా మేనల్లుడు పోటీ చేసే అవకాశాలు ఉండడంతో సివేందు అవకాశం కోసం వెచి చూస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడంతో ముందుజాగ్రత్తగా రాజీనామా చేసి, ప్రత్యక్ష యుద్దానికి తెరలేపారు.

నేనేమి పారాచూట్ ద్వారానో, లిప్టు ఎక్కి పైకి రాలేదని, మెట్లు ఎక్కి ఎదిగానని సివేంద్ ఒక సభలో సీఎం మేనల్లుడిని ఉద్దేశించి అన్నారు. వీలుకానప్పుడు ఒక్కొసారి ఒక్కో మెట్టు ఎక్కానని అన్నారు. మున్ముందు ఆయన మమతాపై మరిన్ని విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.