FbTelugu

నందిగ్రామ్ లో మమత ఓడింది

కొలకతా: రాష్ట్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నప్పటికీ నందిగ్రామ్ అసెంబ్లీ నియోకవర్గంలో మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. బిజెపి అభ్యర్థి సువెందు అధికారి మమతపై 1,622 ఓట్ల తో విజయం సాధించారు.

ఇవాళ ఉదయం కౌంటింగ్ మొదలు మమతను విజయం దోబూచులాడుతోంది. తొలుత సువెందు అధికారి, ఆ తరువాత మమత, మళ్లీ సువెందు ఆధిక్యంలో కొనసాగారు. 16వ రౌండ్ ముగిసిన తరువాత ఆరువేల ఓట్ల ఆధిక్యంలో సువెందు ముందంజలో ఉన్నారు. సువెందు గెలిచినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.