కొలకత్తా: జూలై 6వ తేదీ మొదలు రెండు వారాలపాటు ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్‌పూర్, చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్, సూరత్ నగరాల నుంచి తమ రాష్ట్రానికి విమానాలను నడుపవద్దని పశ్చిమ బెంగాల్ కేంద్రానికి లేఖ రాసింది.
కరోనా ను కట్టడి చేయడం కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో రాష్ట్రంలోకి వచ్చిపోయే విమానాల నియంత్రణ చేయాలని నిర్ణయించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి బెంగాల్లోకి విమానాలు రాకుండా నిలువరించేందుకు చర్యలు చేపట్టింది.
పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడి తగిన చర్యలు చేపడుతున్నామని, అయినా బయటి రాష్ట్రాలు, దేశాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా వచ్చే వారితో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇండోర్, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్‌పూర్, చెన్నై నగరాల నుంచి పశ్చిమబెంగాల్‌కు జూలై 6వ తేదీ మొదలు రెండు వారాలపాటు విమానాలను నడుపవద్దని ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు.