FbTelugu

విషాదంలో మమత కుటుంబం

కొలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కుమారి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ కరోనా పాజిటివ్ తో పోరాడి కన్నుమూశారు. అషీమ్ బెనర్జీ పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆయనను కొలకతాలోని మెడికా హాస్పిటల్ లో చేర్పించారు.

చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం నాడు చనిపోయారు. రాష్ట్రంలో శుక్రవారం నాడు అత్యధికంగా 20,846 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో మొత్తం కేసులు 10,94,802కు చేరుకోగా, ఒక్కరోజే 136 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయినవారు 12,993కు చేరుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.