FbTelugu

ఈసి బిజెపి ఏజెంట్: మమతా బెనర్జీ

కొలకతా: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) బిజెపి ఏజెంట్ గా వ్యవహరించిందని టిఎంసి అధినేత, సిఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది మొదలు కౌంటింగ్ వరకు వేధింపులకు గురి చేసిందన్నారు.

నందిగ్రామ్ ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ 211 ఓట్లతో విజయం సాధించినప్పటికీ, బిజెపి అభ్యర్థి సువేందు గెలిచినట్లు ప్రకటించారని మమత ఆరోపించారు. నందిగ్రామ్ ఫలితాన్ని ప్రకటించవద్దని తమ పార్టీ విజ్ఞప్తి చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి గెలుపు ఈ దేశ ప్రజల విజయమని మమతా బెనర్జీ అన్నారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె తిరిగి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. లేదా శాసన మండలి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై సిఎం గా కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.