FbTelugu

ఆధిక్యంలో మమతా బెనర్జీ

కొలకతా: రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నప్పటికీ నందిగ్రామ్ నియోజకవర్గంలో సిఎం మమతా బెనర్జీ వెనకబడింది. తొలి ఐదు రౌండ్లలో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యం సాధించారు.

మమత వెనకబడడంతో టిఎంసి శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఆరో రౌండ నుంచి కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఆరో రౌండ్ నుంచి మమతా బెనర్జీ 1427 ఓట్ల ఆధిక్యం సాగించడంతో టిఎంసి శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2016 ఎన్నికల్లో టిఎంసి పార్టీ నుంచి సువేందు పోటీ చేసి 81వేల ఓట్లతో విజయం సాధించారు. గతేడాది ఆయన టిఎంసి వీడి బిజెపి తీర్థం పుచ్చుకుని అదే నియోజకవర్గం నుంచి బరిలో నిల్చోగా, సిఎం మమతా తన స్వంత నియోజకవర్గం భవానీపూర్ వీడి నందిగ్రామ్ లో పోటీ కి దిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.