FbTelugu

ప్రకాశంలో ఘోర ప్రమాదం

విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్

9 మంది అక్కడికక్కడే మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం మాచవరం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది మిర్చీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

విద్యుత్ స్థంభాన్ని ఢీకొనడంతో కరెంటు తీగలు తెగిపడి తొమ్మిది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ట్రాక్టర్ లో సుమారు 30 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థల ప్రాంతం హృదయ విదారకంగా ఉంది. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు.

You might also like