సంగారెడ్డి: ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో భారీ పేలుళ్ళు సంభవించాయి. కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వచ్చి పొగతో కంపెనీ మొత్తం వ్యాప్తించాయి.
దీంతో భయాందోళనకు గురైన పలువురు కార్మికులు ఉరుకులు, పరుగులు తీశారు. అయినప్పటికీ కొందరు పరిశ్రమ ఆవరణలో చిక్కుకున్నారు. పొగలు కమ్ముకోవడంతో ఊపిరి ఆడక పలువురు మూర్చతో కిందపడిపోయాయి. శబ్ధాల ధాటికి గందరగోళానికి గురై పరుగెత్తుతూ నేల మీద అపస్మారక స్థితిలో పడిపోయారు. రియాక్టర్ పేలడం మూలంగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయం తెలియగానే నాలుగు ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పే పనుల్లో ఉన్నాయి. ఇంకా కంపెనీలో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది బయటకు వచ్చారనేది తెలియడం లేదు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కళ్లల్లో మంటలు వస్తున్నాయని, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది గా ఉందని అంటున్నారు.