FbTelugu

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్

ముంబయి: ఇన్నళ్లూ స్థబ్దుగా ఉన్న మహారాష్ట్ర పోలీసులు గడ్చిరోలి ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చేశారు. ఎటపల్లి అటవీ ప్రాంతంలో వద్ద సి60 యూనిట్ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఎదురు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం అందింది. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను, భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కాల్పులు భీకరంగా కొనసాగుతుండడంతో ఎటపల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందితే కాని స్పష్టత వచ్చే అవకాశం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.