FbTelugu

బొలెరో ప్రమాదం… 14 మంది దుర్మరణం

లక్నో: ప్రతాప్ ఘడ్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహేంద్ర బొలెరో వాహనం అదుపు తప్పి నేషనల్ హైవే పై ఆగి ఉన్న ట్రక్కును వెనకాల నుంచి ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 14 మంది దుర్మరణం చెందారు. ప్రయాగ్ రాజ్ – లక్నో నేషనల్ హై వే పై దేశ్ రాజ్ ఇనారా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. నవాబ్ గంజ్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి ప్రయాణమై వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రతాప్ గఢ్ ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. అత్యంత వేగంగా ఢీకొట్టడంతో సగ భాగం ట్రక్కు కిందకు దూసుకు వెళ్లిందన్నారు. వాహనం నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను తీసేందుకు చాలా సమయం తీసుకున్నదని ఎస్పీ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.