FbTelugu

25 లక్షల మంది విద్యార్థులకు మొండి చెయ్యి

అమరావతి: సంక్షేమంలో తమ ప్రభుత్వం ముందున్నదని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం పాతిక లక్షల మందికి మెయింటెన్స్ ఫీజులు బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.

బకాయిలు ఎప్పుడిస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా అనే విషయం కూడా ప్రభుత్వ పెద్దలు ప్రకటించకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురి చేస్తున్నారు. 2018-19 విద్యాసంవత్సరం ఐదు నెలల కాలానికి సంబంధించి దాదాపు రూ.500 కోట్ల మేర ఎంటీఎఫ్‌ బకాయిలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులకు మరో రూ.50 కోట్లు మేర ఈ-పాస్‌ బకాయిలు కూడా పేరుకుపోయాయి.

రాష్ట్రంలో ఎస్సి, ఎస్టి, బిసి, ఈబిసి, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకంలో భాగంగా ఇంటర్‌, ఐటిఐ, పాలిటెక్నిక్‌, యూజి, పిజి, ప్రొఫెషనల్‌ కోర్సులు, పిహెచ్‌డి కి సంబంధించి దీర్ఘకాలంగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ లు అందచేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెస్‌ చార్జీలు, మెయింటినెన్స్‌ కోసం నెలవారీగా చెల్లింపులు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండు సంవత్సరాలు దాటినా మంజూరు చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నదని మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.