FbTelugu

ఈ మెయిల్ హ్యాకింగ్ గ్యాంగ్ అరెస్టు

హైదరాబాద్: కార్పొరేట్ కంపెనీల ఈ మెయిల్ హ్యాక్ చేసి లక్షలాది రూపాయలు కొట్టేస్తున్న హ్యాకింగ్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హ్యాకింగ్ ద్వారా కంపెనీ బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ వర్డ్ లు తెలుసుకుని లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. రెండు ఖాతాల నుంచి రూ.88 లక్షలు ఈ ముఠా కాజేయడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగాల్ కు చెందిన సాగర్ మెహతా, కుమార్ గౌరవ్ సింగ్, సంజయ్ లను అరెస్టు చేశారు. వీరి విచారణలో గ్రూపు నాయకుడు ఉన్నాడని తెలియచేయడంతో అతని కోసం గాలింపు మొదలు పెట్టారు.

గ్రూపు నాయకుడు పాల్ హెడ్రీన్ నైజిరియన్ కాగా నగరంలోనే ఉంటూ భారీ మోసాలకు స్కెచ్ వేసి అమలు చేస్తున్నాడు. దీంతో పాటు మరికొందరు మోసగాళ్లు పోలీసులు, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బులు కావాలంటూ మెస్సేజీలు పంపిస్తున్నారు. ఏకంగా నల్లగొండ జిల్లా ఎస్పీ పేరుతో నే నకిలీ ఖాతాను నడిపించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.