FbTelugu

మహీంద్రా థార్ మారిపోయింది!

ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నది. తాజాగా మార్చిన థార్ వాహనం వచ్చే అక్టోబర్ లో మార్కెట్ లోకి రానున్నది.

కారు బాడీ ప్రేమ్ ను సరికొత్త ఫ్లాట్ ఫామ్ పై నిర్మించింది. లోపల పూర్తి నలుపు రంగుతో క్యాబిన్ రూపొందించింది ఎల్ఈడీ లైట్లు, అలాయ్ వీల్స్ ఇచ్చారు. యాపిల్ కార్ ఫ్లే, ఆండ్రాయిడ్ ఆటో వాయిస్ కమాండ్ ఆప్సన్ ను అనుసంధానించారు. దీనిలో స్విచ్చులపై దుమ్ము, నీరు నిలిచే అవకాశం లేదు. పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో మూడేసి వేరియంట్లలో రానున్నాయి. భారత్ స్టేజ్ 6 తో వచ్చే వాహనంలో డీజిల్ 2.2 లీటర్, పెట్రోల్ 2,0 లీటర్ ఎం స్టిలియోన్ ఇంజిన్ అమర్చారు. ధరలు మాత్రం షోరూమ్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది.

You might also like