హీరో మహేష్ బాబు వరుసగా మూడోసారి రికార్డు సాధించారు. అత్యధిక హ్యాష్ టాగ్ లు సాధించి ట్విటర్ లో ట్రెండింగ్ గా నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో సరిలేరు నీకెవ్వరు అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది భారత్ లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన దిల్ బేచారా, సూర్య నటించిన సురారై పొట్రు కాగా మూడో స్థానంలో సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజు అయి మహేష్ బాబు సినిమాల రికార్డులన్నింటిని తిరగరాసింది.
అయితే అంతకు ముందు సంవత్సరం అనగా 2019 లో వచ్చిన మహర్షి సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన మువీగా నిలిచింది. 2018లో భరత్ అను నేను సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్ చేసి ట్యాగ్ చేసి రికార్డులకు ఎక్కిన విషయం విదితమే.