FbTelugu

బాలకృష్ణతో మహేష్ బాబు సందడి..

సినిమాలోతోనే కాకుండా హోస్ట్‌గా తనలోని మరో టాలెంట్‌ను బయటపెడుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ అనే షోలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్‌షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధికి వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఈ షోలో ఇప్పటికే కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, నాచురల్‌ స్టార్‌ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి వచ్చి ప్రోగ్రామ్‌ను విజయవంతం చేస్తున్నారు.

 

అయితే తాజాగా ఈ షోకు సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. ఈ ఇంటర్వ్యూ ఫొటోలు సోషల్‌ మీడియాలో అన్‌స్టాపబుల్‌ అంటూ దూసుకుపోతున్నాయి. బాలకృష్ణ, మహేశ్‌ బాబుతో ఎపిసోడ్‌ ఆద్యంతం సరదాగా గడిచిందని సమాచారం. నవ్వులు, ప్రేక్షకుల చప్పట్లతో షో సందడిగా మారిందట. ఈ సాయంత్రం బాలకృష్ణతో ఎంతో సరదాగా గడిచిందని మహేశ్‌ బాబు తన ఇన్‌స్టాలో స్టోరీ కూడా పెట్టారు. అయితే బాలకృష్ణ, మహేశ్ బాబు కలిసి ఓ టాక్‌షోలో కనిపించడం ఇదే మొదటిసారి. వీరిద్దరి మధ్య ఫన్‌ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే పూర్తి ఎపిసోడ్‌ విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. మహేశ్‌ బాబు రాకతో ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌షో టీఆర్‌పీ రేటింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరగే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.