FbTelugu

మహేశ్ బాబు వినతికి స్పందించిన హాస్పిటల్

తూ.గో.జిల్లా: తెలుగు నటుడు మహేష్ బాబు వినతికి ఆంధ్రా హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ స్పందించింది.

నెల రోజుల చిన్నారికి ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు. పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు పాపను డిశ్చార్జీ చేశారు. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. చిన్నారి శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. తల్లిదండ్రుల ఈ విషయాన్ని మహేశ్ బాబుకు విన్నవించగా, ఆయన స్పందించారు.

పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు మహేష్ బాబు  కోరారు. తల్లిదండ్రులు చిన్నారిని ఈ నెల 2వ తేదీన ఆసుపత్రికి చేర్చగా, అదేరోజు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్యం కుదుటపడలేదు. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో పురోగతి లేకపోవడంతో వైద్యులు చిన్నారిని ఐసీయూకు మార్చారు. పూర్తిగా కోలుకోవడంతో నిన్న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.

You might also like