FbTelugu

ధోనీ… కన్నీళ్లు వస్తున్నాయి!: మహేష్ బాబు

హైదరాబాద్: భారత్ ను విశ్వ విజేతగా నిలిపిన ఆ ఐకానిక్ సిక్సర్ ను నేను ఎలా మరిచిపోగలను అంటూ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ని గుర్తు చేసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు మహేంద్ర సిగ్ దోనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటనపై మహేష్ బాబు స్పందించారు. 2011 లో ఐకానిక్ సిక్సర్ ను నేను ఎలా మరిచిపోతాను అని ట్వీట్ చేశారు. ఆ సమయంలో నేను వాంఖడే స్టేడియంలోనే ఉన్నాను. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, టేక్ బౌ ధోని అని మహేష్ బాబు గుర్తు చేశారు.

You might also like