FbTelugu

పుట్టిన రోజు మొక్క నాటిన మహేష్ బాబు

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని తన నివాసంలో ఆదివారం నాడు మొక్కను నాటారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా పుట్టిన రోజు మొక్కను నాటినట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.

పుట్టిన రోజును జరుపుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదన్నారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ ను సరిహద్దులు దాటనివ్వాలని కోరారు. పచ్చని ప్రపంచం వైపునకు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కను నాటిన తరువాత జూ.ఎన్టీఆర్, తమిళ హీరో దళపతి విజయ్, నటి శృతి హాసన్ కు ఛాలెంజ్ విసిరారు.

You might also like