FbTelugu

మహేష్ బాబు ఇంటిచుట్టూ అంత బందోబస్తా!

ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు తన ఇంటిచుట్టూ భారీగా బందోబస్తు పెట్టుకున్నాడు. ఇది చూసిన అభిమానులు, సిని పరిశ్రమ వర్గాలు కంగుతిన్నాయి. ఎందుకింతగా బందోబస్తు పెంచుకున్నాడంటూ ఆరా తీస్తున్నాయి.

టాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతోంది. షూటింగ్ లు ఆగిపోయాయి. ఎవరుకూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. కరోనా ఏ మూల నుంచి వచ్చి కమ్ముకుంటుందోనన్న భయమే కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయినప్పటికీ కొందరిని కరోనా వైరస్ కాటేసింది. వారిలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఉన్నారు. ఇవన్నీ గమనించిన మహేష్ బాబు ముందుగానే తన ఇంటి ముందు భారీగా సెక్యురిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని కూడా తన ఇంటి వద్దకు రానివ్వడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, ఆయన భార్య ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో డోసు తీసుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని ఇరువురూ నిర్ణయం తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.