FbTelugu

మహేష్ బాబు స్వగ్రామంలో వ్యాక్సినేషన్ పూర్తి

గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో గ్రామస్థులందరికీ వ్యాక్సినేషన్ చేశారు. పది రోజుల వ్యవధిలో గ్రామంలో ఉన్నవారందరికీ ఫస్ట్ డోసు ఇచ్చేసినట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తెలిపారు.

తన తండ్రి ఘట్టమనేని కృష్ణ జన్మదినం సందర్భంగా గ్రామంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో మే 31న ప్రారంభించారు. ఆంధ్రా హాస్పిటల్ సహకారంతో వ్యాక్సిన్ ఇచ్చారు. గ్రామంలో ఉన్నవారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారని నమ్రత తెలిపారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట లో నటిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.