FbTelugu

మహారాష్ట్ర లెక్క 10 వేలు

ముంబై లోనే 7 వేల కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదు అయిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉంది.

రాష్ట్రం మొత్తంగా మూడు వేల కేసులు నమోదుకాగా ఒక్క ముంబై మహా నగరంలోనే ఏడు వేల వరకు నమోదు కావడం కలవరపరుస్తోంది. ఇదే కాకుండా మరణాల్లోనూ ముందు వరుసలో ఉంది. ఇప్పటి వరకు 459 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ రోజు చికిత్స పొందుతూ 27 మంది చనిపోగా వారిలో ముంబై వాసులే 20 మంది వరకు ఉన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తున్నది.

ముఖ్యంగా ముంబై లోని ధారావి మురికి వాడల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇరుకు గదులు, పారిశుధ్య లోపం కారణంగా ఇక్కడ ఎక్కువగా కేసులు ప్రభలుతున్నాయి.

You might also like