FbTelugu

మహా మంత్రులకు కరోనా పాజిటివ్

ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మంత్రి అశోక్ చవాన్, గృహ నిర్మాణ మంత్రి జితేంద్ర అవధ్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇద్దరు మంత్రులకు కరోనా సోకడంతో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు.

కాంగ్రెస్ నాయకుడు చవాన్, ఎన్సీపీ నాయకుడు జితేంద్ర ప్రస్తుతం ఉద్దవ్ థాకరే మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. మంత్రి చవాన్ ముంబై నుంచి స్వగ్రామమైన మరఠ్వాడాకు తరచూ వెళ్లి వస్తున్నారు.

ప్రజలతో సన్నిహితంగా మెలగడం, దగ్గరగా ఉండి మాట్లాడ్డం మూలంగా వైరస్ సోకినట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముంబై లో చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవధ్ కూడా కరోనా వైరస్ సోకింది. నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ కు తరలించారు. మహారాష్ట్రలో కేసుల విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య మార్క్ 50 వేలు దాటగా, ఆదివారం ఒక్కరోజే 3041 కేసులు నమోదు అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.