FbTelugu

డెల్టా ప్లస్ కు సిద్ధమవుతున్న మహారాష్ట్ర

ముంబయి: డెల్టా ప్లస్ వైరస్ తో థర్డ్ వేవ్ కు అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటి నుంచే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్ధమవుతున్నది.

దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. థర్డ్ వేవ్ లో 80 లక్షల మంది వరకు వైరస్ సోకే ప్రమాదముందని, అందులో పదిశాతం వరకు చిన్న పిల్లలు ఉండవచ్చని తెలిపింది ఫస్ట్ వేవ్ లో 19 లక్షలు, సెకండ్ వేవ్ లో 40 లక్షల మందికి పాజిటివ్ వచ్చింది. థర్డ్ వేవ్ లో 80 లక్షల మంది బారిన పడే ప్రమాద ముందని హెచ్చరించింది. కేసులు పెరిగితే ఏ చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉందనే దానిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కేసుల తీవ్రత ఏమాత్రం పెరిగినా ఆసుపత్రులు సన్నద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగితే లాక్ డౌన్ విధించేందుకు వెనకాడమని రాష్ట్ర సహాయ, పునరావాస విభాగం ముఖ్య కార్యదర్శి అసీమ్ గుప్తా వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.