FbTelugu

కరోనా కేసుల్లో మహారాష్ట్ర నెంబర్ 1

హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా కేసుల ఉధృతి భీకరంగా కొనసాగుతున్నది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా బుధవారం నాడు 13,659 కొత్త కేసులు వెలుగుచూశాయి.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో మహారాష్ట్ర కేసులే 13,659 ఉండడం కలవరపాటుకు గురి చేస్తున్నది. నిన్న మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో పదివేల వరకు నమోదు కాగా ఆ సంఖ్య బుధవారానికి తారాస్థాయికి చేరుకున్నది. ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ పెద్దలు గత రెండు వారాలుగా ప్రజలను హెచ్చరిస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా పెరుగుతుండడం గమనార్హం. ప్రజల్లో ఎంత చెబుతున్నా మార్పు రాకపోవడంతో ఏం చేయాలనేదానిపై ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. మరోసారి లాక్ డౌన్ దిశగా వెళ్లాలా, కఠిన ఆంక్షలు అమలు చేయాలా అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.