FbTelugu

కరోనా కాటుతో మహా మంత్రుల విలవిల

ముంబయి: గత వారం పది రోజులుగా కరోనా వైరస్ మహారాష్ట్రలో విజృంభిస్తున్నది. స్వల్ప సంఖ్యలో నమోదు అయ్యే కేసులు రోజుకు మూడు వేల చొప్పున పెరగడంతో ప్రజలు భీతిల్లిపోతున్నారు.

మంత్రులు రాజేష్ తోపేతో పాటు రక్ష్ ఖాడ్సే, రాజేంద్ర షింగ్నేలతో పాటు జయంత్ పాటిల్ కరోనా బారినపడ్డారు. మంత్రి ఓం ప్రకాశ్ బాబురావు తనకు రెండోసారి వైరస్ సోకిందని ట్వీట్ చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందని తమను కలిసిన బంధువులు, సహచరులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రులు కోరారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించి ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకు కనీసం మూడు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నాడు ఒక్కరోజే 4787 కేసులు నమోదు కావడం ఆ మరుసటి రోజు 5వేలకు చేరుకోవడంతో సంచలనం రేపింది.

రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న ముంబై, పూణే ఉండగా ఆ తరువాతి స్థానాల్లో థానే, నాగపూర్, అమరావతి పట్టణాలు ఉన్నాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అమరావతి ప్రాంతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.