FbTelugu

మహారాష్ట్ర నిర్మానుశ్యం

ముంబై: వారాంతపు లాక్ డౌన్ మహారాష్ట్రలో రహదారులు బోసిపోయాయి. ముంబయి లో రోడ్లు నిర్మానుశ్యంగా మారాయి. ఆందోళన కలిగించే విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్రలో నిన్నటి నుంచి వారంతపు లాక్ డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే.

శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకు పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కఠిన ఆంక్షలు అమలుపరుస్తునే ఇవాళ మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ప్రతిపక్ష పార్టీ నాయకులకు వివరించనున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం గుప్పుమంటోంది. గత ఏడాది మాదిరి ఈసారి కూడా ఇబ్బందులు పడే బదులు సొంతూళ్లకు వెళ్లిపోవాలని వలస కుటుంబాలు నిర్ణయించారు. గత నాలుగైదు రోజులుగా వలస కుటుంబాలు కారు, రైలు, బస్సు, లారీల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు.
శుక్రవారం మహారాష్ట్రలో సుమారు 59వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 301 మంది చనిపోయారు. ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల్లో మార్పు రాకపోవడంతో లాక్ డౌన్ ను సోమవారం నుంచి కొనసాగించాలనే యోచన కూడా ఉన్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.