FbTelugu

మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ రాజీనామా

ముంబయి: మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు పంపించారు.
ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ వేసిన పిటీషన్ పై ముంబయి హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

రూ.100 కోట్లు ప్రతినెలా మామూళ్ల కింద చెల్లించాలంటూ హోం శాఖ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ తనను కోరారన్నారు. నిరాకరించడంతో తనపై కక్షగట్టి బదిలీ చేశారంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వాదోపవాదనల తరువాత అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని, హోం శాఖ మంత్రి పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ముంబయి హైకోర్టు సిబిఐ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనీల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.