FbTelugu

కేసులను తగ్గించడం లేదు: మహా ఆరోగ్య మంత్రి

ముంబయి: కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఎప్పుడు కూడా తాము గోప్యత ప్రదర్శించలేదని, ఎన్ని కేసులు నిర్థారణ అయితే ఆ వివరాలు బహిర్గతం చేస్తున్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే స్పష్టం చేశారు.

ఒకరికి కరోనా పాజటివ్ నిర్థారణ కాగానే ప్రైమరీ కాంటాక్టును కూడా పట్టుకుని పరీక్షిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా లెక్కలను దాచేందుకు ఏనాడు ప్రయత్నించలేదని, పూర్తి పారదర్శకంగా ఉన్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫస్ట్ వేవ్ లో అనుభవ పాఠాల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, తీవ్రతను కొంత మేర తగ్గించామన్నారు. సెకండ్ వేవ్ లో ఈ స్థాయలో కేసులు వస్తాయని ఊహించలేదని ఆయన అన్నారు. అయినప్పటికీ ఏమాత్రం వెనకంజ వేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజేష్ తోపే తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.