FbTelugu

సీబీఐ కే మహారాష్ట్ర కండిషన్లు

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సుశాంత్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన కొన్ని గంటల్లోనే నిబంధనల పేరుతో నాటకం మొదలు పెట్టింది.

సీబీఐ అధికారులు కేసు ను ప్రారంభించక ముందే షరతులు వర్తిస్తాయనే విధంగా ప్రకటనలు చేస్తోంది. ఇవాళ సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ కేసును సీబీఐ కు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ బృందం మహారాష్ట్రలో ప్రవేశించే ముందు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు.
ఏడు రోజులు మాత్రమే ఉండాల్సి వస్తే క్వారంటైన నుంచి మినహాయింపు ఉంటుందని అన్నారు. అయితే ఏడు రోజులు మాత్రమే ఉంటున్నట్లు రిటర్న్ టిక్కెట్లు సమర్పించాలన్నారు. ఏడు రోజులకు మించి ఉంటే తమ నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సుశాంత్ కేసులో దర్యాప్తు కోసం వచ్చిన బిహార్ ఐపీఎస్ అధికారి ని బీఎంసీ అధికారులు క్వారంటైన్ పంపిన విషయం తెలిసిందే. ఇది ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసి, పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

You might also like