FbTelugu

స్వాతంత్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ లేదు: సీఎం ఉద్ధవ్

ముంబయి: స్వాంతంత్ర్యోద్యమ పోరాటంలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) పాల్గొనలేదని, భారత్ మాతాకీ జై అన్నంత మాత్రాన బీజేపీ నాయకులు దేశ భక్తులు అయిపోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు చేశారు.
ఇవాళ అసెంబ్లీలో ఉద్ధవ్ థాకరే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరిగారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు కష్టాల్లో ఉన్నారని, ధర్నా చేస్తున్న ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారని ఆయన ఆరోపించారు.

రైతులు ధర్నా ప్రాంతానికి వెళ్లకుండా పెద్ద పెద్ద ఇనుప మేకులు పెట్టారని అన్నారు. ఈ చర్యలు చైనా, బంగ్లదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లో చేస్తే చొరబాట్లు ఉండవని హితవు పలికారు. స్వాతంత్ర్య సంగ్రామంలో మా పార్టీ లేనే లేదని, మరి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. పాల్గొనకుండానే పాల్గన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకుండానే పాల్గొన్నట్లు ప్రచారం చేసుకుంటున్నరని, భారత్ మాతాకీ జై అన్నంత మాత్రాన దేశభక్తులు కాలేదరన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.