FbTelugu

అంబానీ కేసులో బీజేపీ అత్యుత్సాహం: సీఎం ఉద్ధవ్

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద కారు బాంబు కేసుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రశ్నించారు.

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగించడంపై థాకరే ఇవాళ స్పందించారు. రాష్ట్ర పోలీసులు విచారించగల కేసును ఎన్ఐఏ కు అప్పగించడం చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందని థాకరే అనుమానం వ్యకంతం చేశారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కాని అధికారులు ఎల్లప్పుడు ఉంటారని ఎన్ఐఏ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో వాహన యజమాని, ఆటో పార్ట్స్ డీలర్ మన్సుఖ్ హిరేన్ మరణోదంతాన్ని విచారించాల్సిందిగా ఏటీఎస్ కు అప్పగించామన్నారు. తాము విచారిస్తుండగానే, ఎన్ఐఏకు కేసును బదలాయించడంలో తేడా కొడుతున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విచారించగలదని ప్రతిపక్ష బీజేపీ విశ్వసించడం లేదని థాకరే అన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని చూపించాలని అనుకోంటోందని ఆయన విమర్శించారు. ఇదే తరహాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని ఎందుకు సూచిస్తున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్ర పరిధిలోని కేసులు కేంద్రం విచారించిన విధంగానే, ఇంధన ధరలపై కూడా కేంద్రం పన్నులు తగ్గించాలని ఆయన హితవు పలికారు. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్ కరంద్ ఆత్మహత్య కేసుపై తమ పోలీసులు విచారణ జరుపుతున్నారని, త్వరలోనే అన్ని వివరాలు బయటపెడ్తామన్నారు. అంత సీనియర్ ఎంపీ చనిపోతే బీజేపీ ఎందుకు మౌనం వహిస్తున్నది ఆయన ప్రశ్నించారు. అంబానీ విషయంలో ఒక రకంగా, ఎంపీ మోహన్ విషయంలో మరో రకంగా బీజేపీ వ్యవహరిస్తోందని థాకరే మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.