FbTelugu

ఇలాగైతే లాక్ డౌన్ విధిస్తా: మహా సీఎం వార్నింగ్

ముంబయి: కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండడంతో మహారాష్ట్రలో అల్లకల్లోలం మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు ఆరు వేలకు తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

ఇలాగైతే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హెచ్చరించారు. మరో రెండు వారాల పాటు కేసులు సంఖ్య పెరిగితే లాక్ డౌన్ విధిస్తానని, మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోమారు లాక్ డౌన్ కోరుకుంటున్నట్లేనని ఆయన అన్నారు. లాక్ డౌన్ వద్దనుకునే వారు మాస్కులు ధరించాలని, కావాలని అనుకునేవారు మాస్క్ ధరించవద్దని అన్నారు. మీరు మాస్క్ ధరించకపోవడం మూలంగా, భౌతిక దూరం పాటించకపోవడం మూలంగా ఇతరులు ఇబ్బందులు పడుతున్నారని థాకరే హెచ్చరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వేవ్ కొనసాగుతుందా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయని, యావత్మాల్, నాందేడ్, చంద్రాపూర్, నాగపూర్, అమరావతి ప్రాంతాలలో కేసులు భారీగా పెరగుతున్నాయన్నారు. ఇప్పటికే అకోలా, అమరావతి వంటి ప్రాంతాలలో చేయి దాటిపోయిందన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాక్ డౌన్ విధించామన్నారు. మహారాష్ట్రలో మరో మంత్రి చాగన్ భుజబల్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.