FbTelugu

మహారాష్ట్ర సీఎం పీఠం మాదే: శివసేన

ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం పీఠంపై శివసేన ఆసీనులవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇవ్వాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మెజారిటీ ఉందని ఇప్పటి వరకు డాంబికాలు పలికిన బీజేపీ, ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా వెనక్కి తగ్గడం అంటే మహారాష్ట్ర ఓటర్లను అవమానపర్చడమేనన్నారు. ఎన్నికలకు ముందు సీఎం పీఠం చెరిసగం చొప్పున పంచుకోవాలని నిర్ణయించి, ఫలితాల తరువాత మాట మార్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుపుతున్నామని సంజయ్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తక్కువ సమయం ఇచ్చారని, ఇదంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఇదేం డెడ్ లైన్ అని ఆయన గవర్నర్ పై విమర్శలు గుప్పించారు.

You might also like