FbTelugu

ఓట్ల లెక్కింపులో గందరగోళం

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తిరస్కరణకు గురైన అభ్యర్థుల ఓట్లు గల్లంతయ్యాయని తేలడంతో కౌంటింగ్ నిలిపివేశారు.

పోలయిన ఓట్లపై రెండు రోజులుగా కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఏ అభ్యర్థికి సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు ముందు 8 మంది అభ్యర్థుల పేర్లను తొలగించారు. 250 కన్నా తక్కువ ఓట్లు రావడంతో కౌంటింగ్ జాబితా నుంచి వీరిని తొలగించారు. ఈ ప్రక్రియలో 50 ఓట్లు గల్లంతయినట్లు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపిన తరువాత కౌంటింగ్ ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.